భారతదేశం, మే 7 -- Bengal Assembly Dissolved : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గురువారం (మే 7) నాడు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత శాసనసభ పదవీకాలం ముగియడంతో గవర్నర్ ఆర్.ఎన్. రవి అసెంబ్లీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 174(2)(బి) ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగిస్తూ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటన వెలువడిన క్షణం నుంచి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి హోదాను కోల్పోయారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) 80 స్థానాలకే పరిమితం కాగా. భారతీయ జనతా పార్టీ (BJP) 207 స్థానాల్లో ఘనవిజయం సాధించి మెజారిటీని దక్కించుకుంది. అయితే ఈ ఫలితాలను అంగీకరించని మమతా బెనర్జీ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని గతంలోనే భీష్మించారు.
"మేము ప్రజల తీర్పు వల్ల ఓడిపోలేదు.. కుట్రల వల్ల ఓడిపోయాము" అని ఆమె మండిపడ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.