భారతదేశం, ఏప్రిల్ 30 -- తెలంగాణలో సూర్యుడు చుక్కలు చూపిస్తు్న్నాడు. ఉదయం 9 దాటితే జనాలపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. పెరుగుతున్న ఎండల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా బీర్ వినియోగం భారీగా పెరిగింది. ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో సగటున రోజుకు దాదాపు 23 లక్షల బాటిళ్ల బీర్లు అమ్ముడయ్యాయి. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 29 మధ్య 55 లక్షలకు పైగా బీర్ కేసులు అమ్ముడయ్యాయి. 2025లో ఇదే కాలంలో అమ్ముడైన 42 లక్షల కేసులతో పోలిస్తే ఇది వార్షిక పెరుగుదలను సూచిస్తుంది.

ప్రతి కేసులో 750 మిల్లీలీటర్ల 12 సీసాలు ఉంటాయి. అంటే ఏప్రిల్ నెలలోని 29 రోజుల్లో 6.6 కోట్ల సీసాలు వినియోగించారు. అనగా రోజుకు సగటున 22.75 లక్షల సీసాలు అమ్ముడయ్యాయి. వేసవి కాలంలో ఎక్సైజ్ రాబడిలో 50 శాతానికి పైగా బీర్ నుంచే వస్తుందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు మద్యం అమ్మకాలు స...