భారతదేశం, నవంబర్ 24 -- BDL Bhanur Apprenticeship 2026 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ జారీ అయింది. సంగారెడ్డి జిల్లా భానూర్ యూనిట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ ట్రేడుల్లో 134 అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సంవత్సరం పాటు ఈ శిక్షణ ఉంటుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దేశ రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకమైన యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లు, లాంచర్లు, నీటి అడుగున పనిచేసే ఆయుధాలను తయారు చేసే బీడీఎల్ సంస్థలో శిక్షణ పొందడం యువత భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళాలకు అవసరమైన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను రూపొందించే ఈ సంస్థలో ఒక ఏడాది పాటు పని అనుభవం సం...