bathukamma uyyala songs lyrics : తంగేడు చెట్టు నవ్వి పూచెనయా.. ఉయ్యాల.. బతుకమ్మ పాట లిరిక్స్
భారతదేశం, అక్టోబర్ 6 -- సింగార పల్లెల్లో సంతోషమాయెనే... ఉయ్యాల ||
తొలకరి వానలు పారిన వేళనా... ఉయ్యాల
చెరువుల లోపల నీళ్లు నిండేనయా... ఉయ్యాల
పచ్చని చేలల్ల పైర్లు ఊగంగా... ఉయ్యాల
తంగేడు చెట్టు నవ్వి పూచెనయా... ఉయ్యాల ||
అక్కా చెల్లెళ్లు అందరూ రారండి... ఉయ్యాల
అల్లిబిల్లిగ పూలు ఏరుకొద్దాము... ఉయ్యాల
పచ్చని గునుగు పూలు దోసిళ్ల పడగా... ఉయ్యాల
గుమ్మడి పూలలోన గౌరమ్మ నిలవగా... ఉయ్యాల ||
తామర పూలన్నీ తారలై నిలవగా... ఉయ్యాల
కాటుక పూలల్ల కాంతి చిందేనయా... ఉయ్యాల
రుద్రాక్ష పూలన్నీ హారాలాయెనయా... ఉయ్యాల
దంతెన పూలతో దారింత సువాసన... ఉయ్యాల ||
రంగు రంగుల పూలు రాశిగా పోసి... ఉయ్యాల
ఇత్తడి తాంబాలం ఎంతో సింగారించి... ఉయ్యాల
అరిటాకు పరచి మనం పేర్చుదామమ్మా... ఉయ్యాల
ఎత్తైన బతుకమ్మను పేరుద్దామమ్మా... ఉయ్యాల ||
నెత్తిపైన గౌరమ్మను నిలుపుదామమ్మా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.