భారతదేశం, అక్టోబర్ 4 -- ఓ దేవి గౌరమ్మ.. శ్రీదేవి గౌరమ్మ.. ఉయ్యాలో

మా ఇంటి ముంగిట్లోకి మళ్లీ వచ్చినావా.. ఉయ్యాలో

రంగురంగుల పూల చీర గట్టి.. ఉయ్యాలో

తెలంగాణ నేలంతా వెలుగులు నింపినావా.. ఉయ్యాలో

వాగుల వంకల్లో వాలిన వానలకు.. ఉయ్యాలో

చేల గట్ల పొంటి పూసిన పూలన్నీ.. ఉయ్యాలో

గునుగు, తంగేడు, సన్నజాజులు తెచ్చి.. ఉయ్యాలో

గుమ్మడి, చామంతులు కోసి.. ఉయ్యాలో

తంబాలంపైన ముచ్చటగ పేర్చి.. ఉయ్యాలో

ఏడు రంగుల హరివిల్లులా తీర్చి.. ఉయ్యాలో

అత్తవారింటి నుంచి వచ్చిన పిల్లలు.. ఉయ్యాలో

పుట్టింటి ఆత్మీయత నెమరేసుకుంటూ.. ఉయ్యాలో

పట్టుకోకలు కట్టి, పసుపు పారాణితో.. ఉయ్యాలో

చేతి గాజుల చప్పుడు ముంగిట నిండంగ.. ఉయ్యాలో

అక్కాచెల్లెళ్లంతా ఒకటై కలసి.. ఉయ్యాలో

వలయంగా తిరుగుతూ పాటలు పాడంగ.. ఉయ్యాలో

పసుపుతో గౌరమ్మ ముద్దను చేసి.. ఉయ్యాలో

కుంకుమ బొట్టు పెట్టి కొలిచెదమమ...