భారతదేశం, మే 3 -- Bhumi Pednekar Emotional On Bargi Dam Cruise Accident: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా బర్గి డ్యామ్ వద్ద జరిగిన పడవ ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. గురువారం (ఏప్రిల్ 30) సాయంత్రం నర్మదా నదిపై ప్రయాణిస్తున్న 'నర్మదా క్వీన్' అనే టూరిస్ట్ క్రూయిజ్ బోట్ అకస్మాత్తుగా బోల్తా పడటంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ హృదయ విదారక ఘటనపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ప్రమాదంలో ఒక తల్లి తన బిడ్డను గుండెలకు హత్తుకుని విగతజీవిగా పడి ఉన్న దృశ్యం తనను కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇది అత్యంత విషాదకరం, గుండెలు పిండేసే ఘటన. దీనికి ఎవరూ బాధ్యత వహించరా? బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. తన కుమారుడిని గట్టిగా పట్టుకుని ప్రాణాలు వదిలిన ఆ తల్లి దృశ్యం నా కళ్ల ముందు నుంచి కదలడం లేదు. ...