భారతదేశం, మే 12 -- Bandi Sanjay Son Bhagirath POCSO Case : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ పోక్సో కేసు వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసుపై ఇప్పటికే ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఓవైపు దర్యాప్తు జరుగుతుండగా.. మరోవైపు భగీరథ్ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

తనపై నమోదైన పోక్సో (POCSO) కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టులకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో. ఈ పిటిషన్‌పై ఈనెల 14వ తేదీన వెకేషన్‌ బెంచ్‌ విచారణ చేపట్టనుంది.

తన 17 ఏళ్ల కుమార్తెను బండి భగీరథ్‌ వేధిస్తున్నాడంటూ ఒక బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌లోని పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స...