భారతదేశం, మే 16 -- Bandi Bhagirath POCSO Case : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ కేసులో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. నిందితుడు ఏ క్షణమైనా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందనే అనుమానంతో పోలీసులు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, రేవులను అప్రమత్తం చేస్తూ లుకౌట్ సర్క్యులర్ (LOC) నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్‌పై ఇప్పటికే అత్యంత కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో.. అతనిని ఎలాగైనా అదుపులోకి తీసుకునేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.

బండి భగీరథ్‌ జాడ కనిపెట్టేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు సాంకేతిక ఆధారాలు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వేర్వేరు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. నిందితుడితో నిరంతరం సంప్రదింపుల్లో ...