భారతదేశం, జూలై 9 -- Bandi Bhagirath POCSO Case : తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత కొన్ని రోజులుగా ఈ కేసుపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం..ఇవాళ తుది తీర్పును వెల్లడించింది.

బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కొన్ని కీలక షరతులను విధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. రూ. లక్ష రూపాయల సొంత పూచీకత్తుతో పాటు, అంతే మొత్తానికి ఇద్దరు వ్యక్తుల జామీను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ షరతులను పూర్తి చేసిన తర్వాత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కేసు దర్యాప్తుకు సంబంధించిన అంశాలపై హైకోర్టు పలు ఆంక్షలు విధించింది. ఈ కేసులో ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థిత...