భారతదేశం, మే 11 -- బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు గురించి ఇప్పుడు తెలంగామలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. భగీరథ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు భగీరథ్‌కు సంబంధించి కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

భగీరథ్‌ పోక్సో కేసుపై తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉంది. ఈ కేసు వ్యవహారంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎంద...