Bandi Bhageerath Case : పోలీసుల విచారణకు హాజరుకాని బండి సంజయ్ కుమారుడు భగీరథ్
భారతదేశం, మే 13 -- కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఒక మైనర్ బాలికను వేధించారనే ఆరోపణలపై నమోదైన పోక్సో(POCSO) కేసులో విచారణ నిమిత్తం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కు రావాలని పోలీసులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. అయితే నిర్ణీత సమయానికి ఆయన పోలీసుల ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
తన 17 ఏళ్ల కుమార్తెను బండి భగీరథ్ వేధిస్తున్నాడంటూ సదరు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత ఈ కేసులో బీఎన్ఎస్ (BNS) లోని సెక్షన్ 74, 75తో పాటు, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్విత్ 12 కింద అభియోగాలు మోపారు.
కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలి నుంచి సేకరించిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కీలక నిర్ణయం తీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.