భారతదేశం, మే 12 -- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో(POCSO) కేసు నమోదైన నేపథ్యంలో ఆయన గత మూడు రోజులుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉండటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

పెట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనప్పటి నుండి భగీరథ్ ఆచూకీ లభించడం లేదు. సిట్ అధికారి రితిరాజ్ ప్రకారం, గత మూడు రోజులుగా బండి భగీరథ్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. పోలీసుల కళ్లు గప్పి ఆయన ఎక్కడో రహస్య ప్రాంతంలో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఫోన్ స్వీచ్ ఆఫ్ రావడంపై మరింతగా సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసామని, మరిన్ని వివరాల కో...