భారతదేశం, మార్చి 14 -- పశ్చిమాసియాలో యుద్ధం రాయలసీమ ప్రాంతంలోని అరటి రైతులపై ప్రభావాన్ని చూపిస్తోంది. దీని ఫలితంగా అరటి ఎగుమతులు ఆగిపోయాయి. అంతేకాదు మార్కెట్లలో ధరలు పడిపోయాయి. నెల క్రితం టన్ను అరటి ధర రూ.20,000 నుండి రూ.25,000 వరకు పలికింది. ఇప్పుడు అది టన్నుకు రూ.8,000కు పడిపోయింది. కనీస మద్దతు ధర దొరుకుతుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అరటిపండ్లు తోటల్లోనే ఉన్నాయి.
కడప, అనంతపురం ప్రాంతాలలో ప్రధానంగా పండించే అరటికి దక్షిణ, ఉత్తర రాష్ట్రాలలోనే కాకుండా గల్ఫ్ దేశాలలో కూడా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. వ్యాపార సంస్థలు సాధారణంగా తోటలను సందర్శించి గ్రామంలోని రైతుల నుండి నేరుగా అరటిపండ్లను కొనుగోలు చేస్తాయి. వాటిని ప్యాకేజీ చేసి పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేస్తారు. టర్కీలో అరటిపండ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటి పండ్లు వారం పాటు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.