Balochistan Blast : బలూచిస్థాన్‌లో మారణహోమం- సైనికులు వెళుతున్న రైలుపై దాడి.. 24మంది మృతి!
భారతదేశం, మే 24 -- పాకిస్థాన్‌లోని అశాంతి నిండిన నైరుతి ప్రావిన్స్ బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో ఘోర బాంబు పేలుడు సంభవించింది. సైనిక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో వెళుతున్న ఒక రైలును లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. క్వెట్టాలోని చమన్ పట్టక్ సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న కారు.. రైలు బోగీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ భీకర ఆత్మాహుతి దాడిలో కనీసం 24 మంది మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది.
ఈద్ (రంజాన్) పండుగ వేడుకల కోసం క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పెషావర్ వెళుతున్న సైనికులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ తిరుగుబాటుదారులు ఈ దారుణానికి ఒడిగట్టారు. మంగళవారం నుంచి ఈద్ సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైలులో రద్దీ ఎక్కువ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.