భారతదేశం, ఏప్రిల్ 21 -- Balakrishna Koratala Siva: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక వార్త సెన్సేషన్‌గా మారింది. 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా రాబోతోందన్న వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ ఇద్దరి కలయికలో సినిమా రాలేదు. కానీ ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని ఫిల్మ్ నగర్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

ప్రస్తుతం కొరటాల శివ చేతిలో జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాల్సిన 'దేవర 2' ఉంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ (NTR 31)లో బిజీగా ఉన్నారు.

ఆ సినిమా పూర్తయ్యే వరకు 'దేవర 2' పట్టాలెక్కే అవకాశం లేదు. ఈ ఖాళీ సమయంలోనే బాలకృష్ణతో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను పూర్తి చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మే 2వ తేదీని రానున్నట్ల...