భారతదేశం, మే 25 -- పండుగ దగ్గరపడుతున్న కొద్దీ బక్రీద్ సెలవు తేదీపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. సాధారణంగా ముస్లింల పండుగలు నెలవంక దర్శనం ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ క్రమంలోనే జూన్ నెలలో వస్తుందని భావించిన బక్రీద్ పండుగ, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మే నెల చివరలోనే రానుంది. భారతదేశంలోని అత్యధిక ప్రాంతాలతో పాటు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా ఈ ఏడాది మే 28, 2026 (గురువారం) నాడు బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండుగను ఘనంగా జరుపుకోనున్నారు.

సాధారణంగా బక్రీద్ పండుగను దేశవ్యాప్తంగా ఒక రోజు జరుపుకొంటారు. అయితే ఈసారి నెలవంక దర్శనంలో మార్పుల వల్ల కొన్ని రాష్ట్రాల్లో సెలవుల విషయంలో సవరణలు చేశారు. గతంలో అధికారిక క్యాలెండర్ ప్రకారం మే 27న సెలవుగా భావించినప్పటికీ, ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల 'దుల్ హిజ్జా' నెలవంక ఆలస్యంగా కనిపించ...