భారతదేశం, మార్చి 11 -- ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్, సింగర్ బాద్‌షా మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. మార్చి 1, 2026న విడుదలైన బాద్‌షా కొత్త పాట 'తతీరీ' ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఈ పాటలో చూపించిన విజువల్స్, వాడిన లిరిక్స్ అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు.

ముఖ్యంగా హర్యానా రోడ్‌వేస్ బస్సులో పాఠశాల యూనిఫాం ధరించిన అమ్మాయిలతో అసభ్యకరమైన చేష్టలు చేయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బాద్‌షా తీరుపై గాయని సోనా మోహపాత్ర సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.

"చిన్న పిల్లలను, స్కూల్ యూనిఫాంలను ఇలాంటి అసభ్యకర చిత్రణ కోసం వాడుకోవడం ఆపండి. ఇది మన సమాజపు ఆత్మను దెబ్బతీస్తోంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 'హర్యానా బిడ్డను' అని చెప్పుకుంటే సరిపోదని, కళాకారుడిగా సామాజిక బాధ్యత ఉండాలని సోనా మోహపాత...