భారతదేశం, నవంబర్ 21 -- Mohammad Azharuddin On Mohammed Siraj Exclusion: న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో భారత తుది జట్టు ఎంపిక ఇప్పుడు క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అనుభవజ్ఞుడైన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించడాన్ని మాజీ క్రికెటర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

గురువారం (నవంబర్ 19) బేసిన్ రిజర్వ్ మైదానంలో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో సిరాజ్ స్థానంలో యువ పేసర్ అన్షుల్ కాంబోజ్‌కు అవకాశం ఇవ్వడంపై మాజీ కెప్టెన్, తెలంగాణ మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ఘాటుగా స్పందించారు.

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన అజారుద్దీన్, తన నగరానికి చెందిన పేసర్‌కు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా గళమెత్తారు. జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేని సమయాల్లో ...