భారతదేశం, మే 4 -- Ayushmann Khurrana On Pati Patni Aur Woh 2 Controversy: బాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన లేటెస్ట్ మూవీ పతి పత్నీ ఔర్ వో 2. శనివారం (మే 2) ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ వేదికగా పతి పత్నీ ఔర్ వో 2 సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు ముదస్సర్ అజీజ్‌తో పాటు చిత్ర కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా, కథానాయికలు సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, వామికా గబ్బి ఈ వేడుకలో పాల్గొన్నారు.

అయితే, పతి పత్నీ ఔర్ వో 2 టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమా కథాంశంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. వివాహేతర (అక్రమ) సంబంధాలను ఈ చిత్రం వెనకేసుకొస్తోందన్న ఆరోపణలు రావడంతో, మూవీ ట్రైలర్ లాంచ్ వేదికగా ఆయుష్మాన్ ఖురానా ఆ సందేహాలకు తెరదించారు.

పతి పత్నీ ఔర్ వో 2 సినిమా స్టోరీ లైన్ గురించి విలేకరులు అడిగిన ...