భారతదేశం, మార్చి 21 -- ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ సెన్సేషన్‌గా మారాడు. రణ్‌వీర్ ప్రధాన పాత్రలో వచ్చిన 'ధురంధర్ 2' ప్రభంజనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ముంబైలో ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్‌లో 'ధురంధర్‌లోని షరారత్' సాంగ్ ఫేమ్, టాలీవుడ్ హీరోయిన్ అయేషా ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ధురంధర్ 2 సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూ, చిత్ర బృందంతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆయేషా ఒక ఎమోషనల్ నోట్ రాశారు.

ఓజీ ధురంధర్స్‌తో అంటూ ఆ ఫొటోలను షేర్ చేసినన ఆయేషా ఖాన్ హీరో రణ్‌వీర్ సింగ్‌ గురించి "నేను మొదటి రోజు నుంచే మీ ఫ్యాన్‌ని. మీరు మరెన్నో విజయాలు అందుకోవాలి" అని పేర్కొన్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ గురించి చెబుతూ.. "సార్, మీతో చేసిన ప్రతి సంభాషణ నా జీవితాంతం గుర్తుంటుంది. మీ పనితనం, వ్యక్తిగత జీవితాన్ని మీరు బ్యాలెన్స్ చేసే విధానం చూస్త...