భారతదేశం, నవంబర్ 24 -- Avengers Doomsday Advance Booking In India: హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్, భారీ స్క్రీన్లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. ఇప్పుడు మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'అవెంజర్స్: డూమ్స్‌డే' సినిమా విడుదలకు ముందే భారత బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది.

థియేటర్లలోకి రావడానికి ఇంకా 23 రోజుల సమయం ఉండగానే అవెంజర్స్ డూమ్స్‌డే దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు 8 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.

భారత అభిమానులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా #OpenDoomsdayBookings హ్యాష్‌ట్యాగ్‌తో పెద్ద ఎత్తున ట్రెండ్ చేయడంతో, మార్వెల్ స్టూడియ...