భారతదేశం, ఏప్రిల్ 20 -- Director Atlee Blessed With Baby Girl Today: టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఇంట్లో వేడుకలు మొదలయ్యాయి. అట్లీ, ప్రియ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. సోమవారం (ఏప్రిల్ 20) ఈ జంటకు పండంటి ఆడబిడ్డ జన్మించింది.

డైరెక్టర్ అట్లీ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. "బ్లెస్డ్" (దీవించబడ్డాం) అనే క్యాప్షన్‌తో తన కుమారుడు మీర్ పెద్దన్నయ్య అయ్యాడంటూ ఒక క్యూట్ పోస్టర్‌ను షేర్ చేశారు. "యే.. నాకు చెల్లి వచ్చింది! మీర్ ఇప్పుడు పెద్దన్నయ్య. మాకు ఆడబిడ్డ పుట్టింది - ఏప్రిల్ 20, 2026" అంటూ ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు.

అట్లీ, ప్రియ దంపతులకు 2014లో వివాహం జరగ్గా, ఎనిమిదేళ్ల తర్వాత 2023 జనవరిలో మొదటి సంతానం మీర్ జన్మించాడు. ఇప్పు...