భారతదేశం, జూన్ 28 -- రాష్ట్ర యువతను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) అప్పుడే అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. నైపుణ్యాలే రేపటి భవిష్యత్తుకు బలమైన పునాది అనే దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు... పల్లెల్లోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతమైన ఉట్నూర్ ప్రభుత్వ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ సాధించిన ఘన విజయం ఇప్పుడు యావత్ రాష్ట్రానికే ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచింది.

గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చెందిన నిరుపేద యువతకు సైతం ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యాలను ఉచితంగా అందించి, వారిని గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలకు సిద్ధం చేయా...