భారతదేశం, నవంబర్ 23 -- ఆగ్నేయాసియా దేశాలతో దీర్ఘకాలిక సముద్ర భాగస్వామ్యాన్ని (మారిటైమ్ పార్టనర్‌షిప్) ఏర్పరచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంతో ఆసక్తిగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పోర్ట్ కనెక్టివిటీ, డిజిటల్ టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. సోమవారం విశాఖపట్నంలో జరిగిన 'ఆసియాన్-ఇండియా మారిటైమ్ కాంక్లేవ్లో మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్రంలో ఓడ రేవుల మౌలిక సదుపాయాలు, తయారీ రంగ వ్యవస్థ, డిజిటల్ కనెక్టివిటీని వేగంగా విస్తరిస్తున్నట్లు లోకేశ్ వివరించారు. తద్వారా దేశంలోనే అత్యంత కీలకమైన సముద్ర, పారిశ్రామిక ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని ఆయన తెలిపారు.

"మెరుగైన పోర్ట్ కనెక్టివిటీ, డిజిటల్ టెక్నాలజీ, క్లీన్ ఎ...