Artificial Intelligence : '2027లో జాగ్రత్త'.. ఏఐతో కొవిడ్‌కి మించిన భారీ సంక్షోభం!
భారతదేశం, నవంబర్ 29 -- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రస్తుతం ప్రపంచం ఎంత వణికిపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా లక్షలాది మంది ఈ ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయారు. మిగిలిన వారిలోనూ ఏదో ఒక అందోళన కనిపిస్తూనే ఉంటోంది. ఈ తరుణంలో ఓ ఏఐ పరిశోధకుడు వెన్నులో వణుకు పుట్టించే హెచ్చరికను ప్రపంచానికి పంపించారు. ఏఐపై మానవాళి నియంత్రణ కోల్పోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదకరమైన ఏఐ వ్యవస్థలను పరీక్షించే లాభాపేక్ష లేని సంస్థ ఎంఈటీఆర్లో టెక్నికల్ స్టాఫ్ సభ్యుడిగా పనిచేస్తున్న నికోలా జుర్కోవిచ్.. 'ఎక్స్' వేదికగా ఓ బహిరంగ లేఖ పంచుకున్నారు. ఏళ్ల తరబడి ఏఐ గురించి మనసులోనే ఆందోళన చెందుతున్నానని, సమయం మించిపోకముందే మాట్లాడటం తన బాధ్యతగా భావిస్తున్నానని అందులో పేర్కొన్నారు.
"వచ్చే థాంక్స్‌గివింగ్ నాటికి మనం బతికి ఉంటామో లేదో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.