భారతదేశం, నవంబర్ 29 -- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ (ఏఐ)తో ప్రస్తుతం ప్రపంచం ఎంత వణికిపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా లక్షలాది మంది ఈ ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయారు. మిగిలిన వారిలోనూ ఏదో ఒక అందోళన కనిపిస్తూనే ఉంటోంది. ఈ తరుణంలో ఓ ఏఐ పరిశోధకుడు వెన్నులో వణుకు పుట్టించే హెచ్చరికను ప్రపంచానికి పంపించారు. ఏఐపై మానవాళి నియంత్రణ కోల్పోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాదకరమైన ఏఐ వ్యవస్థలను పరీక్షించే లాభాపేక్ష లేని సంస్థ ఎంఈటీఆర్​లో టెక్నికల్ స్టాఫ్ సభ్యుడిగా పనిచేస్తున్న నికోలా జుర్కోవిచ్.. 'ఎక్స్' వేదికగా ఓ బహిరంగ లేఖ పంచుకున్నారు. ఏళ్ల తరబడి ఏఐ గురించి మనసులోనే ఆందోళన చెందుతున్నానని, సమయం మించిపోకముందే మాట్లాడటం తన బాధ్యతగా భావిస్తున్నానని అందులో పేర్కొన్నారు.

"వచ్చే థాంక్స్‌గివింగ్ నాటికి మనం బతికి ఉంటామో లేదో ...