భారతదేశం, మార్చి 23 -- బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో గతేడాది డిసెంబర్‌లో రిలీజైన 'ధురంధర్' చిత్రం 2008 ముంబై దాడుల నాటి భీభత్సాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి ప్రేక్షకులను వణికించింది. ఈ సినిమాలో పాకిస్థాన్ ఐఎస్ఐ (ISI) మేజర్ ఇక్బాల్‌గా విలన్ రోల్‌లో ఆకట్టుకున్నారు అర్జున్ రాంపాల్. తాజాగా ఒక అవార్డు వేడుకలో 26/11 దాడులకు సంబంధించి తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు అర్జున్.

"2008లో ముంబై దాడులు జరిగిన రాత్రి నా పుట్టినరోజు వేడుకల కోసం స్నేహితులను పికప్ చేసుకోవడానికి హోటల్‌కు వెళ్లాను. మేమంతా తాజ్ హోటల్‌కు బయలుదేరుతుండగా మాహిమ్ వద్ద మొదటి పేలుడు శబ్దం వినిపించింది. ఆ ధాటికి కారు అద్దాలు గజగజ వణికిపోయాయి. అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు" అని అర్జున్ రాంపాల్ తెలిపారు.

"కొద్దిసేపటికే ఫోన్లు రావడం మొదలైం...