భారతదేశం, ఏప్రిల్ 23 -- Bigg Boss Arjun Ambati Paramapada Sopanam Pre Release Event: బిగ్ బాస్ అర్జున్ అంబటి హీరోగా 'గణపర్తి శ్వేత' సమర్పణలో 'స్వయంభూ క్రియేషన్స్' బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం 'పరమపద సోపానం'. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు.

తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా.. పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో అర్జున్ అంబటికి జోడీగా జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్ కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పరమపద సోపానం సినిమా ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఈ క్రమంలో మంగళవారం (ఏప్రిల్ 21) నాడు పరమపద సోపానం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర తదితరులు ముఖ్య అతిథ...