భారతదేశం, ఆగస్టు 15 -- IRCTC Araku Tour Package : ప్రకృతి రమణీయతకు నిలయమైన అరకు లోయను ఒక్క రోజులోనే ఆహ్లాదకరంగా చుట్టి రావాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

"అరకు రైల్ - కమ్ - రోడ్ ప్యాకేజీ" పేరుతో ఒక రోజు విహార యాత్రను నిర్వహిస్తోంది. విశాఖపట్నం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో పర్యాటకులు రైలు, రోడ్డు మార్గాల ద్వారా ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ విహరించవచ్చు.

ఈ ప్యాకేజీ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. ప్రయాణంలో భాగంగా పర్యాటకులకు రుచికరమైన ఉదయపు టిఫిన్, మధ్యాహ్న భోజనం మరియు సాయంత్రం స్నాక్స్ (శాఖాహారం) అందిస్తారు.

విశాఖ - అరకు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.. కంఫర్ట్ క్లాస్(EV) లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.6545, డబుల్ అక్యుపెన్సీకి రూ.4055,ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 3225గా నిర్ణయించారు. చిన్నార...