భారతదేశం, జనవరి 30 -- రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ మేరకు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APTWREIS) నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ ప్రవేశాల కోసం అర్హులైన వారు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఫిబ్రవరి 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.ప్రతి జనరల్ ఎస్టీ గురుకుల పాఠశాలలో మొత్తం 80 సీట్లు ఉంటాయి. ఈ 80 సీట్లను ఒక్కో సెక్షన్‌కు 40 మంది చొప్పున రెండు సెక్షన్లుగా విభజిస్తారు. మొత్తం సీట్లలో ఎస్టీలకు 78 శాతం సీట్లను కేటాయిస్తారు. మిగతా సీట్లను బీసీ, ఓసీ, ఎస్సీ విద్యార్థులతో భర్తీ చేస్తారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.