భారతదేశం, ఆగస్టు 14 -- APSRTC Free Bus Scheme : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఆర్థిక సాధికారతకు 'స్త్రీ శక్తి' పథకం కొత్త అర్థాన్ని తీసుకొచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టు 15న ఈ పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తూ వారి రోజువారీ ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గిస్తోంది.

రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎన్నిసార్లయినా పరిమితులు లేకుండా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించడంతో మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. స్త్రీ శక్తి పథకం ప్రాంరంభం నాటి నుంచి ఇప్పటి వరకు 87 కోట్ల ప్రయాణాలను వివిధ వర్గాల మహిళలు చేశారు. మహిళల ప్రయాణానికి ప్రభుత్వం రోజుకు రూ.8.53 కోట్లను సబ్సిడీగా అందిస్తోంది. పథకం అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలో ఇప్పటివరకు రూ.3,095 కోట్లు ఈ ...