భారతదేశం, మార్చి 17 -- దివ్యాంగుల సంక్షేమం, సామాజిక సమ్మిళితత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2026 మార్చి 18న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులోకి వస్తుంది. RPwD చట్టం, 2016లోని సెక్షన్ 2 (ZC) పరిధిలోకి వచ్చే, 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన అర్హులైన దివ్యాంగులందరికీ ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని ఏపీఎస్ఆర్టీసీ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన పీహెచ్‌సీ/వికలాంగుల ధృవీకరణ పత్రం ఉండాలి.

స్త్రీ శక్తి ప...