భారతదేశం, ఏప్రిల్ 6 -- రాష్ట్రంలోని 10 గురుకుల జూనియర్​ కళాశాలల్లో(APRJC 2026) ఇంటర్మీడియట్​ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఏప్రిల్ 7వ తేదీతో పూర్తి కానుంది. అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. అంతేకాకుండా సీట్లు పొందే వారికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.

దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్‌ 24వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో చేరవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,425 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆబ్జెక్టివ్‌...