భారతదేశం, అక్టోబర్ 13 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టింది. గత నెల 15వ తేదీన 254 పోస్టుల భర్తీ కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయగా. తాజాగా పూర్తిస్థాయి నోటిఫికేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ ప్రకటన ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అనలిస్ట్ గ్రేడ్-2తో పాటు అసెంబ్లీ రిపోర్టర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, కేటగిరీల వారీగా కేటాయింపులు, వేతన శ్రేణి, వయోపరిమితి మరియు విద్యా అర్హతల వంటి పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://portal-psc.ap.gov.in/ లో పొందుపరిచారు.

అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబరు 13, 2026 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ...