భారతదేశం, జూలై 2 -- ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ పోస్టులకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలనకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

గత ఏడాది (2025) జూలై 15 నుండి జూలై 23 వరకు ఆన్‌లైన్ విధానంలో (CBT) నిర్వహించిన రాత పరీక్షల మార్కుల ఆధారంగా ఈ మెరిట్ జాబితాను రూపొందించారు. రాత పరీక్షలో అర్హత సాధించి, తదుపరి దశకు ఎంపికైన అభ్యర్థులకు జూలై 6, 2026 ఉదయం 10:00 గంటలకు విజయవాడలోని ఏపీపీఎస్‌సీ ప్రధాన కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే అదే రోజున అభ్య...