భారతదేశం, అక్టోబర్ 6 -- APPSC Group 1 Notification 2026 : గ్రూప్ 1 ఉద్యోగమే లక్ష్యంగా కొలువుల సాధనకై ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. మొత్తం 166 గ్రూప్-1 ఖాళీల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి నుంచి షురూ అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఆసక్తి గల అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక పోర్టల్ ( https://portal-psc.ap.gov.in/ లేదా https://psc.ap.gov.in ) ద్వారా ఓటీపీఆర్ (OTPR) నమోదు చేసుకుని, దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ సమగ్ర వివరాలను కూడా కమిషన్ వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంచారు.

గ్రూప్-1 పరిధిలోని అత్యధిక పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉ...