భారతదేశం, అక్టోబర్ 22 -- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లోని థానేదార్ పోస్టులకు సంబంధించి వాకింగ్ టెస్ట్, వైద్య పరీక్షలకు తాత్కాలికంగా అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని లెక్చరర్ పోస్టులకు సంబంధించి మూడు సబ్జెక్టులకు సంబంధించిన తాత్కాలిక ఎంపిక ఫలితాలను కూడా ప్రకటించింది.

కమిషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం సెప్టెంబర్ 9, 2025 నాటి నోటిఫికేషన్ నంబర్ 13/2025 ద్వారా చేపట్టిన థానేదార్ నియామక ప్రక్రియలో, తదుపరి దశకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచారు.

ఫిబ్రవరి 9, 2026న (ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో), ఫిబ్రవరి 10, 2026న (మధ్యాహ్నం సెషన్‌లో) ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి 13 జిల్లాల్లో నిర్వహ...