భారతదేశం, సెప్టెంబర్ 20 -- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నడిబొడ్డున అత్యంత ఎత్తైన, ఆకర్షణీయమైన భవనాల్లో ఒకటిగా నిలిచే అసెంబ్లీ ఐకానిక్ భవనంపై 250 మీటర్ల ఎత్తున్న 'స్పైర్' నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీని నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు వీలుగా రూ.661 కోట్లకు పరిపాలనాపరమైన ఆమోదం తెలిపినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 66వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల వివరాలను మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ప్...