భారతదేశం, సెప్టెంబర్ 17 -- Anil Ravipudi Released Vevela Oohale Chupina Song: అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ 'బా బా బ్లాక్ షీప్'. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు.

అక్టోబ‌ర్ 9న బా బా బ్లాక్ షీప్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయే, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, క‌శ్య‌ప్‌, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మేఘాల‌య రాష్ట్రంలో పూర్తిగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న తొలి ద‌క్షిణాది సినిమా ఇదే కావ‌టం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ బా బా బ్లాక్ షీప్ సినిమా టీజ‌ర్, రీసెంట్‌గా రిలీజైన 'ఆజా మేరీ జాని' సాంగ...