భారతదేశం, సెప్టెంబర్ 2 -- Rangareddy Anganwadi Recruitment 2026 : రంగారెడ్డి జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని 7 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 125 ఖాళీలున్నాయి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శ్రమతి శాంతి శ్రీ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం. మొదటి దశలో ఈ అంగన్‌వాడీ టీచర్ ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను 2026 సెప్టెంబరు 10వ తేదీ సాయంత్రం 5:00 గంటల లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.

అభ్యర్థిని తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణురాలై ఉండాలి. 01 జూలై 2026 నాటికి కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 35 సంవత...