భారతదేశం, ఆగస్టు 16 -- Andhrapradesh Weather Alert : బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో కొత్తగా అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ అల్పపీడన ప్రభావం రాబోయే 24 గంటల్లో తీవ్రతరం కానుంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా మరింత బలపడే అవకాశం ఉంది. అల్పపీడన కదలికలతో తీరప్రాంతాలతో పాటు అనేక ప్రాంతాల్లో వాతావరణం వేగంగా మారిపోయే అవకాశం ఉంది

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండకూడదని, అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. గాల...