Andhrapradesh Ports : ఏపీలో మూడు పోర్టుల విస్తరణ - 6 వేల ఎకరాల భూసేకరణకు గ్రీన్ సిగ్నల్
భారతదేశం, జూలై 16 -- ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రూపురేఖలను మార్చేలా, సముద్ర తీర ఆధారిత పరిశ్రమలకు ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మూడు ప్రధాన ఓడరేవుల (పోర్టుల) రెండో విడత (ఫేజ్-2) విస్తరణ పనుల కోసం భారీగా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టుల అభివృద్ధి కోసం రూ.1,638 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 6,248 ఎకరాల భూమిని సేకరించేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ఈ భూసేకరణకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. ఈ భూసేకరణకు అయ్యే ఖర్చును పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు (APMB)...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.