భారతదేశం, మార్చి 28 -- విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా 13-19 ఏళ్ల మధ్య ఉన్న కౌమార విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 'ఆంధ్రప్రదేశ్ స్కూలు హెల్వెల్నెస్ ప్రోగ్రాం' కింద డిజిటల్ పోర్టల్ ను రూపొందించింది. విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యం, వ్యసనాల దుష్ప్రభావాలు మానసిక ఉల్లాసం, మంచి పద్ధతుల తెలుసుకునేలా అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానంతో ఈ కొత్త పోర్టల్ ను సిద్ధం చేసింది.

బాల బాలికలు ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, మత్తు పదార్ధాల వినియోగానికి దూరంగా ఉండడం, లింగ సమానత్వం వంటి అంశాలపై సమాచారం ఇందులో ఉంటుంది. హెచ్ఐవీ, రోడ్డు ప్రమాదాల బారినపడకుండా ఉండడo ఇంటర్నెటు, సామాజిక మాధ్యమాల సురక్షిత వినియోగం వంటి అంశాలపై స్వీయ విధానం (సెల్ఫ్ లెర్నింగ్)లో నేర్చుకునేలా 'ఏపీఎ...