Andhrapradesh : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ నిఘా - రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు
భారతదేశం, మార్చి 29 -- మార్కాపురంలో ప్రైవేట్ బస్సు ఘటనలో 14 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేట్ బస్సులపై రవాణాశాఖ ఫోకస్ పెట్టింది. ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది.
సరైన పత్రాలు లేని మోటార్ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. రోడ్డు, హైవేస్, అగ్ని మాపకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నుంచి ఈ తనిఖీలు జరుగుతున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలు, వివిధ చెక్‌పోస్టుల వద్ద బస్సులను చెక్ చేస్తున్నారు. చింతూరు పోలీస్ స్టేషన్, పలమనేరు, నరహరిపేట, జిలుగుమిల్లి, కత్తిపూడి, పుల్లూరు టోల్ ప్లాజా, సున్నిపెంట, చిలకల్లు టోల్ ప్లాజా, బడవ టోల్ ప్లాజా, సాగర్ ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.