భారతదేశం, సెప్టెంబర్ 28 -- ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో గుండె సంబంధిత వైద్య సేవలను మరింత విస్తరిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు. ఆ దిశగా సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోందని చెప్పారు. గుండె జబ్బుల చికిత్స కోసం పేద ప్రజలు ఇతర ప్రాంతాలకు లేదా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ఏటా సెప్టెంబరు 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 2026లో ప్రపంచ హృదయ సమాఖ్య "డోంట్‌ మిస్‌ ఎ బీట్‌" అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గుండె జబ్బుల ముందస్తు సంకేతాలను గుర్తించడం, గుండెను సకాలంలో కాపాడుకోవడం, గుండె ఆరోగ్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరడమే ఈ ప్రచారంలోని ప్రధాన ఉ...