భారతదేశం, సెప్టెంబర్ 9 -- APCPDCL Ganesh Pandal Electricity Permission : వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై ఏపీసీపీడీసీఎల్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ పండుగ సీజన్‌లో ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పి. పుల్లారెడ్డి స్పష్టం చేశారు. భక్తిశ్రద్ధలతో పాటు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉత్సవాలను సురక్షితంగా జరుపుకోవాలని ఆయన నిర్వాహకులకు పిలుపునిచ్చారు.

మండపాల్లో లైటింగ్, ఇతర విద్యుత్ అలంకరణల కోసం అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాల సందర్భంగా మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఈ నెల 26వ తేదీ వరకు గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇస్తారు. దీనిక...