భారతదేశం, జూన్ 6 -- Southwest Monsoon Andhra Pradesh : సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఎండతీవ్రతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అందించిన సమాచారం ప్రకారం... జూన్ 6 శనివారం నాడు రుతుపవనాలు ఏపీలోని రాయలసీమ ప్రాంతాలను తాకాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.

ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు చూస్తుంటే.. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి మరింత బలాన్ని పుంజుకుని, ఆంధ్రప్రదేశ్ అంతటా వేగంగా విస్తరించడానికి పూర్తి అనుకూల వాతావరణం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

రాయలసీమ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం నుంచే ఆకాశం మేఘావృతమై.. చల్లటి గాలులతో కూడిన వర్షాలు ప్రార...