భారతదేశం, అక్టోబర్ 31 -- Andhra Pradesh Cyclone Alert : ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం అత్యంత వేగంగా బలపడుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాబోయే 6 గంటల వ్యవధిలోనే పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత మరింత తీవ్రరూపం దాల్చి. ఆదివారం సాయంత్రానికి తుపానుగా మారనుందని హెచ్చరించింది.

ఈ తుఫాన్ సోమవారం సాయంత్రానికి పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారనుంది. ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్రా (మధ్య కోస్తా), రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురి...