భారతదేశం, అక్టోబర్ 2 -- Anakapalli Movie Review And Rating In Telugu: ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ రూరల్ లవ్ రొమాంటిక్ రివేంజ్ యాక్షన్ డ్రామా చిత్రం 'అనకాపల్లి'.

కాండ్రేగుల నాయుడు, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతలుగా రూపొందించిన ఈ సినిమాతో ఖగేష్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీని అక్టోబర్ 2న అంటే ఇవాళ విడుదల చేశారు. మరి ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఏ మేరకు మెప్పించిందో నేటి అనకాపల్లి రివ్యూలో చూద్దాం.

అనకాపల్లిలో బుల్లెట్ (తారక్ పొన్నప్ప) తిరుగులేని రౌడీలా చలమాణి అవుతుంటాడు. బుల్లెట్‌కి నాయుడు (కాండ్రేగుల నాయుడు) అనే డ్రగ్ డీలర్‌తో గొడవలు ఉంటాయి. ఇక అదే గ్రామంలో కరెంట్ ఆఫీసులో ఏఈగా పని చేస్తుంటాడు సాంబ శివ రావు (త్రినాథరావు నక్కిన). అతని కొడుకే సూ...