భారతదేశం, జూన్ 13 -- Actress Amulya Sri Suicide: వెండితెరపై మెరిసిపోవాలని, హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలతో హైదరాబాద్ మహానగరంలో అడుగుపెట్టింది ఆ యువతి. తన ప్రతిభతో షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలోనే కామాంధుల కన్ను ఆమెపై పడింది.

సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో నివాసముంటున్న షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ.. కొందరు మృగాళ్ల వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఇప్పుడు నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

సినీ రంగుల ప్రపంచాన్ని నమ్ముకుని వచ్చే యువతులను లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు డిజిటల్ దాడులకు తెగబడుతున్నారు. రహస్య కెమెరాలు, స్మార్ట్‌ఫోన్ల సాయంతో వ్యక్తిగత వ...